తెలంగాణలో ఒక్కరోజు వ్యవధిలో 771 మందికి కరోనా

  • గత 24 గంటల్లో 39,320 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 289 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న వారు 581 మంది
  • ఇంకా 5,733 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 39,320 శాంపిల్స్ పరీక్షించగా, 771 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో అత్యధికంగా 289 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 53, పెద్దపల్లి జిల్లాలో 49, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 47, యాదాద్రి భువనగిరి జిల్లాలో 33, కరీంనగర్ జిల్లాలో 31 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 581 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. 

తెలంగాణలో ఇప్పటివరకు 8,20,617 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,10,773 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,733 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.

Telangana
Corona Virus
Daily Cases
Media Bulletin

More Telugu News